Posts

Showing posts from January, 2026

అసమర్ధుని ఆలాపన

లేవరా లే కదలరా కదులు రేపు నేడయ్యింది నేడు మోడయ్యింది బతుకు బరువయ్యింది గుండె ఇరుకయ్యింది॥ భీరువని నినుతలచి విడచెదరు జనులు మరిరారు నీదరికి సతీసుతులు॥ కదలరా ధైర్యమ్ము నెయ్యమైదలచి నడువరా నువునమ్ము భయములను విడచి॥ కదిలేటి నినుజూచి వరియించు జయలక్ష్మి॥ కదలరా నీగుండె ఘల్లుమనిపించి నడవరా నిశివీధి దారులను త్రుంచి॥ రేపు నేడయ్యింది నేడు మొదలయ్యింది॥ విధినేడు నినుజూచి తలలువంచింది తొలితూర్పు నీకనుల తలుపు తట్టింది॥ లేవరా సుకుమార సౌధమ్ము విడచి నడవరా నిశివీధి దారులను విడచి॥ ~ చలం