తాండవ ప్రార్థన

వ్యాఘ్రాంభరధర త్రిశూలపాణి నర్తించెడు ఈ ప్రదోష సమయమున
రివ్వు రివ్వుమను జటాఝాటము లయబధ్ధముగా ఎగురుచుండగ
ఢమ ఢమ ఢమ ఢమ పదఘట్టనలే మృదంగ ధ్వనులై మ్రోగుచుండగ
తల్లి పార్వతీ మణిమయ కుండలములు విచిత్ర రీతిన వెలుగుచుండగ

ధరిన భ్రమపడితి భీతిల్లుచు నే పద ఘట్టనలనే పిడుగులై తలచి
ఆనందించితి చల్లగాలులకు దివిలోన కాన్పించిన దివ్య కాంతులకు
మాయ తొలగించరా భీమలింగేశ్వర కరుణామృత జల్లు నాపైన కురిపి
ప్రణమిల్లితి నీకు పాహి పరమేశ్వరా దయజూపి దీవించి నీ దరికి జేర్చరా

~ చలం లక్కాప్రగడ

Comments

  1. సంపూర్ణ సరస్వతి అనుగ్రహం ప్రాప్తిరస్తు

    ReplyDelete
  2. పార్వతీ పరమేశ్వర, పార్వతీప రమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు ... ఏకా కుటుంబం

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

నేను చూసిన నిజాలు

శై'శవం'