నేను చూసిన నిజాలు
కదిలే అలలు
అలలపై తేలే కలలు
ఆశగా ఎగిరే పక్షుల సంగీతం
హాయిగా నవ్వే పిల్లల నవ్వులోని మకరందం
చిన్ని చిన్ని దారులు
ఆ దారులలో జనుల పరుగులు
బ్రతుకుకై మనుషల పోరాటం
ఎగరలేక ఆగిపోయే పక్షుల ఆరాటం
ఆకలితో ఆశగా ఎగిరే పక్షులను
చేతిలో గింజలతో వశపరచుకునే మానవ నైజం.
మనిషికి పక్షులు లోకువ
మనిషికి మనిషే లోకువ
మూసుకున్న కంటి నుండి జాలువారిన గంగా ప్రవాహం
గంగమ్మ సుడుల ఒరిపిడికి ఎర్రబడ్డ శుక్లపక్ష చంద్ర బింబం
~ చలం
Adbuthaha... Chalam ji
ReplyDelete👌
ReplyDelete