గమ్యం

గమ్యం


మొదలు కాని పయనం
దిశలు లేని గమ్యం
అలవి కాని మార్గం
కదలలేని చలనం

ఆశలన్ని పదిలం
ఊహాలన్ని జటిలం
మనసులోని కదనం
గెలవకుంటె రుధిరం

కదులుతున్న కాలం
కలిసిరాని తీరం
ఎదురీతిక తధ్యం
సాధించుట సాధ్యం



~ చలం లక్కాప్రగడ

Comments

Popular posts from this blog

తాండవ ప్రార్థన

నేను చూసిన నిజాలు

శై'శవం'