ఆలోచన
పుర్రేయందున పుట్టి క్షణకాలమున బెరిగి
అతిశయించుచు పవన వేగంబు కూడి
రక్తచలనంబుతోడ తనువంత చేరి
దెందమును పలువిధముల రెచ్చగొట్టేవు
నొకచోనానందము నొకచోనాందోళన
నొకచోనుద్రేకము నొకచోనుత్సాహము
నొకచోనుత్తేజము నొకచోనిస్సత్తువ
అనాలోచితంగా జనించిన ఆలోచనా నీకు వందనం
~ చలం లక్కాప్రగడ
ఏ ఆలోచనా లేకుండా ఆలోచన గురించి ఇలా బాగా రాసి ఆలోచన గురించి ఆలోచించేలా చేసిన నీ ఆలోచనకు మరో ఆలోచన లేకుండా మెచ్చుకుంటున్నాను
ReplyDeleteఏ ఆలోచనా లేకుండా ఆలోచన గురించి ఇలా బాగా రాసి ఆలోచన గురించి ఆలోచించేలా చేసిన నీ ఆలోచనకు మరో ఆలోచన లేకుండా మెచ్చుకుంటూ... నీ ఏకా కుటుంబం.
ReplyDelete