బావుటా

ఆవేశపు ఆక్రందన వినిపించిన వేదం

కల్లోలపు మదియంచున కలిగిన నిర్వేదం

వినిపించని ఎదచప్పుడు పలికించిన కావ్యం

మూసిన కనురెప్పలలో కనిపించే ఒక సత్యం


విశాల విశ్వం అంచుల చివరన

నిలిచున్న ఓ మిత్రమా


మాటలనే వర్ష బాణ వాడి ములుకులు

గ్రుచ్చిగ్రుచ్చి చిద్రమైన ఛత్రమువలె

పడి నిలిచిన నేస్తమా

జగతి గతి అర్ధమవ్వక

అస్తమించిన సోమమా


తెలుసుకోరా తెలిసి తెలియని

ఈ లోకం పోకడ

నేర్చుకోరా నివ్వెరపరచే

ఈ జీవన చలనం


వెలుగు నీడల నడుమ నలిగే

ఎరుపు నెత్తుటి సంద్రం

ఉరుకుతున్నది ప్రజ్వరిల్లిన

జ్ఞానజిలుగుల దీపం


సత్య ధర్మముల భేధమేరిగి

మానవత్వపు మర్మమెరిగి

నిలువరా ఈ ధరన వెలిగే భాను దీపపు జ్యోతివై

నిలుపరా నీ వెలుగు బావుట అంధకారాపు అవనిపై


~ చలం

Comments

  1. నువ్వు సూపెరెహ్... చాలా కాలం తర్వాత ఒక్కసారి నన్ను నేను చూసుకున్నట్లు ఉందిరా... శెభాష్... నీ మామ...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

తాండవ ప్రార్థన

నేను చూసిన నిజాలు

శై'శవం'