చితికిన బ్రతుకులు
పలుచటి చొక్కా
చిరిగిన ధోతి
జీవము లేని జుట్టు
ఆశలు లేని కళ్ళు
ఎముకల గూడు శరీరం
మోయలేని భారంతో కృంగిన భుజాలు
జీవితంతో పోరాటం చేస్తుంటే
దారిద్యంతో కదలలేని కాళ్ళు
కాలచక్రంలో పరుగెడుతూ తడబడుతున్నాయి
పది నూర్ల విలువైన మందుల చీటి ఒక చేతిలో
ఐదు నూర్ల విలువైన కాగితం మరొక చేతిలో
సగం బ్రతికిన బ్రతుకులు
పూర్తికావడానికి కూడా ఆలోచిస్తున్నాయి
~చలం
Comments
Post a Comment