జీవన సత్యం

 అన్నీ తెలుసు అనుకునే ఓ మనిషీ

నీ పయనమెచటికి


అన్నిటికీ దేవుడా అంటావు
అన్నీ నావే అంటావు


కష్టసుఖాలు అన్నీ తెలుసు అంటావు
వాటి కుదుపులకు నలుగుతావు


ప్రేమంటే ఇవ్వడం అంటావు
ఇచ్చింది మళ్ళీ కావాలి అంటావు


కాటికి పరుగులు తప్పదు అంటావు
ఎప్పటికీ నీ వారితో ఉండాలనుంది అంటావు


అంతః సౌందర్యం అందం అంటావు
అద్దం లో చూసి మురిసిపోతావు


బంధాలు సమయానుగుణంగా మారతాయి అంటావు
అవే బంధాలు కనుమరుగు అవుతుంటే కంటి నిండా విలపిస్తావు


జీవితమే మాయ అంటూ వల్లిస్తావు
అదే మాయా చట్రంలో జీవిత గమనాన్ని వెతుకుతావు


అన్నీ తెలుసు అనుకునే ఓ మనిషి
జీవన సత్యం తెలుసుకో నేటికి

ఒంటరిగా పుట్టిన ఓ మనిషీ
చివరంట నీకు నీవే ఎప్పటికీ


~ చలం లక్కప్రగడ

Comments

Post a Comment

Popular posts from this blog

తాండవ ప్రార్థన

నేను చూసిన నిజాలు

శై'శవం'